పూర్తి అవసరాలను
If you encounter any technical issues during the course, please email coel@braou.ac.in
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పొందే అభ్యసన ఫలితాలు (Learning Outcomes)
- గణిత పాఠ్య ప్రణాళికపై పరిజ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు (Knowledge).
- సూక్ష్మబోధన భావనను నిర్వచించగలరు (Knowledge).
- సూక్ష్మబోధన చట్రంలోని సొపానాలను విశ్లేషించగలరు (Analysis).
- వార్షిక ప్రణాళిక తయారీలో నైపుణ్యాన్ని పొందుతారు (Skill).
- వార్షిక ప్రణాళికను రూపకల్పన చేయగలరు (Synthesis).
- యూనిట్ పథకాన్ని విశ్లేషించగలరు (Analysis).
- పీరియడ్ పథక తయారీలో నైపుణ్యాన్ని పొందుతారు (Skill).
- పీరియడ్ పథకాన్ని రూపకల్పన చేయగలరు (Synthesis).
సామర్థ్యాలు (Competencies)
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పొందే యోగ్యతలు:
- తరగతి గదిలో భావప్రసార నైపుణ్యాలను ప్రదర్శించగలరు.
- తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించగలరు.
- అభ్యాస లక్ష్యాల అమరికలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు.
- అంచనాలను (Assessment) రూపకల్పన చేయగలరు.
- పాఠ్య ప్రణాళిక ఆధారంగా గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన చేయగలరు.
- తరగతి గదిలో వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రాతినిధ్యం చేయగలరు.