కోర్స్ వివరణ
| साइट: | Dr. B.R. Ambedkar Open University Online Learning Portal |
| कोर्स: | గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన |
| पुस्तक: | కోర్స్ వివరణ |
| द्वारा छापा गया: | Guest user |
| दिनांक: | मंगलवार, 2 जून 2026, 12:15 PM |
विवरण
If you encounter any technical issues during the course, please email coel@braou.ac.in
सामग्री की तालिका
- 1. అభ్యాసన ఫలితాలు మరియు యోగ్యతలు
- 2. కోర్సు అవలోకనం(Course Overview)
- 3. కోర్సు నిర్మాణం(Course structure)
- 4. కోర్సు పూర్తి మరియు మదింపు (Completion and assessment)
- 5. అవసరమైన నైపుణ్యాలు
- 6. ధృవీకరణ పత్రం(Certificate)/బ్యాడ్జి(Badge)
- 7. సంభాషణ వేదిక/చర్చా వేదికలు
- 8. సాంకేతిక సహాయం
- 9. గ్రంథాలయ సేవలు, EMRRC మరియు OER మద్దతు
- 10. విద్యార్థి సహాయక సేవలు
- 11. కోర్సు పరిచయం(Course introduction)
- 12. సమన్వయకర్త
- 13. సార్వత్రిక విద్యా వనరుల వినియోగం
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పొందే అభ్యసన ఫలితాలు (Learning Outcomes)
- గణిత పాఠ్య ప్రణాళికపై పరిజ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు (Knowledge).
- సూక్ష్మబోధన భావనను నిర్వచించగలరు (Knowledge).
- సూక్ష్మబోధన చట్రంలోని సొపానాలను విశ్లేషించగలరు (Analysis).
- వార్షిక ప్రణాళిక తయారీలో నైపుణ్యాన్ని పొందుతారు (Skill).
- వార్షిక ప్రణాళికను రూపకల్పన చేయగలరు (Synthesis).
- యూనిట్ పథకాన్ని విశ్లేషించగలరు (Analysis).
- పీరియడ్ పథక తయారీలో నైపుణ్యాన్ని పొందుతారు (Skill).
- పీరియడ్ పథకాన్ని రూపకల్పన చేయగలరు (Synthesis).
సామర్థ్యాలు (Competencies)
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పొందే యోగ్యతలు:
- తరగతి గదిలో భావప్రసార నైపుణ్యాలను ప్రదర్శించగలరు.
- తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించగలరు.
- అభ్యాస లక్ష్యాల అమరికలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు.
- అంచనాలను (Assessment) రూపకల్పన చేయగలరు.
- పాఠ్య ప్రణాళిక ఆధారంగా గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన చేయగలరు.
- తరగతి గదిలో వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రాతినిధ్యం చేయగలరు.
ఈ కోర్సులో మీరు నేర్చుకునే అంశాలు
- సూక్ష్మబోధన చక్రంలోని వివిధ సొపానాలను విశ్లేషించగలరు.
- వివిధ సూక్ష్మబోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ విద్యార్థులు వివరించగలరు.
- ఒక నైపుణ్యానికి సంబంధించిన సూక్ష్మబోధన పాఠ్య ప్రణాళికను తయారు చేయగలరు.
- వివిధ నైపుణ్యాలలోని మౌలిక అంశాలను సాధన ద్వారా అలవరచుకుని నైపుణ్యాన్ని పొందగలరు.
- బోధనలో సూక్ష్మబోధన ప్రణాళిక రచన యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలరు.
- వివిధ విద్యావేత్తలు సూచించిన సూక్ష్మబోధన నైపుణ్యాల పట్టికలను విశ్లేషించగలరు.
- యూనిట్, సాంవత్సరిక మరియు పీరియడ్ పథకాలు రాయడంలో నైపుణ్యం సంపాదించగలరు.
- సూక్ష్మబోధన యొక్క భావన, అర్థాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలరు.
ఈ కోర్సులో పొందుపరచబడిన పాఠ్యాంశాలు
- సూక్ష్మబోధన
- వార్షిక ప్రణాళిక
- యూనిట్ పథకం
- పీరియడ్ పథకం
Format
ఇది స్వీయ-గమన (Self-paced) విధానంలో నిర్వహించబడే మైక్రో కోర్సు. ఇందులో అభ్యాసకులు ఇతరుల ప్రశ్నలు మరియు అభిప్రాయాలపై చర్చించేందుకు ప్రోత్సహించబడతారు.
అభ్యసన సమయం
ఈ కోర్సును పూర్తి చేయడానికి అంచనా అభ్యసన సమయం 240 నిమిషాలు.
భాష
తెలుగు
పద్ధతి
ఆన్‌లైన్
Target Audience
B.Ed కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు
కోర్సు నిర్మాణం
ఈ కోర్సులో మొత్తం 4 యూనిట్లు ఉంటాయి:
యూనిట్ పేర్లు:
- సూక్ష్మ బోధన
- వార్షిక పథకం
- యూనిట్ పథకం
- పీరియడ్ పథకం
అభ్యర్థులకు సూచనలు
- మీరు ఈ కోర్సులోని అన్ని యూనిట్లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత కోర్సు బ్యాడ్జ్ అందుకుంటారు.
- కోర్సును పూర్తి చేసిన తరువాత పూర్తి సర్టిఫికేట్ అందుతుంది.
- అవసరమైతే, మీరు చిన్న రుసుముతో సర్టిఫికేట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
- ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మరియు మెరుగుదలకు సంబంధించిన సూచనలు మాతో పంచుకోవాలని కోరుతున్నాము.
అభ్యర్థులకు సూచనలు
- ఈ కోర్సులో మొత్తం 4 యూనిట్లు ఉన్నాయి.
- ఈ కోర్సును పూర్తి చేయడానికి కేటాయించిన సమయం 240 నిమిషాలు.
- ఈ కోర్సును ఒకేసారి కాకుండా, ప్రతి రోజు సుమారు ఒక గంట చొప్పున అభ్యసించడం మంచిది.
- కోర్సులోని అన్ని యూనిట్లను పూర్తి చేసి, ప్రతి యూనిట్ చివర ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయాలి.
- కోర్సు చివర ఇవ్వబడిన ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేసి, కేటాయించిన ప్రదేశంలో అప్లోడ్ చేయాలి.
- కోర్సులో ఇవ్వబడిన అన్ని అసైన్‌మెంట్‌లను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
- ప్రతి అసైన్‌మెంట్‌కు మార్కులు కేటాయించబడుతాయి.
- సూక్ష్మబోధనపై ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి.
- Word ఫైల్‌ను PDFగా మార్చడం మరియు ఫైళ్లను అప్లోడ్ చేయడం తెలిసి ఉండాలి.
- మొబైల్ / ల్యాప్‌టాప్ / కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఇమెయిల్ ఐడి కలిగి ఉండాలి.
- కంప్యూటర్ వినియోగంపై ప్రాథమిక నైపుణ్యాలు ఉండాలి.
కోర్సు లోని అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాత మీకు ధృవీకరణ పత్రం ప్రధానం చేయడం జరుగుతుంది.
.
సాంకేతిక సమచారం కోసం క్రింది మైల్ ఐడి కి ఈమెయిల్ చేయగలరు
drpadalalaxman@braou.ac.in
.
ఉపాధ్యాయులు, విద్యార్థులలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, బోధనాభ్యసన సామాగ్రి, బోధనా పద్దతులు మొదలైన అంశాలకు సంబంధించి ఒకే ప్రణాళికను తయారుచేసుకున్నట్లయితే బోధన సులభతరం అవుతుందని మనకు తెలుసుగదా! ఒకే క్రమపద్ధతి, ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సరం కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి లక్ష్యాలు, సమయం ముందుగా నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా అనుకుంటే, ఆ వ్యవస్థలో అనేక ఉప వ్యవస్థలు ఉంటాయి. ఉప వ్యవస్థలు విశ్లేషిస్తే గానీ వ్యవస్థను మెరుగుపరచలేము. సూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించటానికి కావలసిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది. సూక్ష్మబోధనా నైపుణ్యాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు తరగతి గది లక్ష్యాలను చక్కగా సాధించవచ్చు. వివిధ నైపుణ్యాలతో పాటు వార్షిక పథకం, యూనిట్ పథకం మరియు పీరియడ్ పథకాల అవగాహన కూడా ఉపాధ్యాయులకు అత్యవసరం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా తరగతి బోధన కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయక పీరియడ్ పథకాలతో పాటుగా నూతనంగా నచ్చిన రాష్ట్ర విద్యా పరిశోధన
శిక్షణా సంస్థ వెలువరించిన నిరంతర సమగ్ర మూల్యాంకన ఆధారిత, పీరియడ్ పథకం యొక్క అవగాహన చాత్రోపాధ్యాయులకు తప్పనిసరిగా ఉండాలి.
డా. పడాల లక్ష్మణ్
అసిస్టెంట్ ప్రొఫెసర్
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
DRBRAOU, హైదరాబాద్
.
| S.No | Topic and Unit Number | TASL Attribution | Repurposed/Re Used | Details | |
|
1 |
సూక్ష్మబోధన భావన |
Attribution: "Micro Teaching concept" by Teacher Plus is licensed under CC BY-SA 3.0 |
reused |
||
|
2 |
reused |
||||
|
3 |
సూక్ష్మబోధన చట్రం |
Micro Teaching by Dr.Padala Laxman is licensed under CC By-SA 3.0 |
reused |
||
|
4 |
SCERT Resourse Book |
- |
|||