కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పొందే అభ్యసన ఫలితాలు (Learning Outcomes)

  1. గణిత పాఠ్య ప్రణాళికపై పరిజ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు (Knowledge).
  2. సూక్ష్మబోధన భావనను నిర్వచించగలరు (Knowledge).
  3. సూక్ష్మబోధన చట్రంలోని సొపానాలను విశ్లేషించగలరు (Analysis).
  4. వార్షిక ప్రణాళిక తయారీలో నైపుణ్యాన్ని పొందుతారు (Skill).
  5. వార్షిక ప్రణాళికను రూపకల్పన చేయగలరు (Synthesis).
  6. యూనిట్ పథకాన్ని విశ్లేషించగలరు (Analysis).
  7. పీరియడ్ పథక తయారీలో నైపుణ్యాన్ని పొందుతారు (Skill).
  8. పీరియడ్ పథకాన్ని రూపకల్పన చేయగలరు (Synthesis).

సామర్థ్యాలు (Competencies)

కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పొందే యోగ్యతలు:

  • తరగతి గదిలో భావప్రసార నైపుణ్యాలను ప్రదర్శించగలరు.
  • తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించగలరు.
  • అభ్యాస లక్ష్యాల అమరికలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు.
  • అంచనాలను (Assessment) రూపకల్పన చేయగలరు.
  • పాఠ్య ప్రణాళిక ఆధారంగా గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన చేయగలరు.
  • తరగతి గదిలో వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రాతినిధ్యం చేయగలరు.