تکمیل کے تقاضے
آخری ترمیم: ہفتہ, 25 اپریل 2026, 6:02 PM
సూక్ష్మబోధనలో పాఠ్యాంశాన్ని బోధించే సమయం మరియు తరగతిలోని విద్యార్థుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటాయి. దీనివల్ల ఉపాధ్యాయ విద్యార్థి ఒక నిర్దిష్ట బోధనా నైపుణ్యంపై కేంద్రీకరించి సాధన చేసి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది ఉపాధ్యాయ విద్యలోని శిక్షణార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమం. ఉపాధ్యాయ విద్యార్థుల బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసి పటిష్టం చేయడానికి ఉపయోగపడే సాంకేతిక విధానమే సూక్ష్మబోధన. సూక్ష్మబోధనకు సంబంధించిన ప్రముఖ విద్యావేత్తల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం.