अनुभाग की रूपरेखा
-
గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన
ఉపాధ్యాయులు, విద్యార్థులలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, బోధనాభ్యసన సామగ్రి, బోధనా పద్ధతులు మొదలైన అంశాలకు సంబంధించి ఒకే ప్రణాళికను తయారుచేసుకున్నట్లయితే బోధన సులభతరం అవుతుందని మనకు తెలుసు కదా! ఒకే క్రమపద్ధతి, ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సరం కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి లక్ష్యాలు, సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా భావిస్తే, ఆ వ్యవస్థలో అనేక ఉపవ్యవస్థలు ఉంటాయి. వివిధ నైపుణ్యాలతో పాటు వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక మరియు పీరియడ్ ప్రణాళికలపై అవగాహన కూడా ఉపాధ్యాయులకు అత్యవసరం.
గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన అనే పేరుతో రూపొందించిన ఈ నాన్-క్రెడిట్ మైక్రో-కోర్సు, “Implementation of Open Educational Resources (OER) at Dr. BRAOU, Hyderabad” అనే ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్‌ను CEMCA (Commonwealth Educational Media Centre for Asia) మరియు Dr. B. R. Ambedkar Open University (BRAOU), Hyderabad సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.
ఈ కోర్సు Creative Commons Attribution–Share Alike 4.0 International License (CC BY-SA 4.0) క్రింద లైసెన్స్ చేయబడింది. అందువల్ల, ఈ విద్యా సామగ్రిని సరైన గుర్తింపు (attribution) ఇచ్చి, అదే లైసెన్స్ షరతులతో పంచుకోవచ్చు మరియు అవసరమైతే మార్చుకుని ఉపయోగించుకోవచ్చు
కోర్సు పరిచయం(Course introduction)
ఉపాధ్యాయులు, విద్యార్థులలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, బోధనాభ్యసన సామగ్రి, బోధనా పద్ధతులు మొదలైన అంశాలకు సంబంధించి ఒకే ప్రణాళికను రూపొందించుకుంటే బోధన సులభతరం అవుతుందని మనకు తెలిసిందే. ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ప్రకారం, ఒక విద్యా సంవత్సరంలో బోధించాల్సిన అంశాలకు సంబంధించిన లక్ష్యాలు మరియు సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా భావిస్తే, ఆ వ్యవస్థలో అనేక ఉపవ్యవస్థలు ఉంటాయి. ఆ ఉపవ్యవస్థలను విశ్లేషించడం ద్వారా మాత్రమే మొత్తం వ్యవస్థను మెరుగుపరచగలం. సూక్ష్మబోధన (Micro-teaching) సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించి, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది. సూక్ష్మబోధనా నైపుణ్యాల ద్వారా శిక్షణార్థి ఉపాధ్యాయులు తరగతి గది లక్ష్యాలను సమర్థవంతంగా సాధించగలరు. వివిధ బోధనా నైపుణ్యాలతో పాటు వార్షిక పథకం, యూనిట్ పథకం మరియు పీరియడ్ పథకాలపై అవగాహన ఉపాధ్యాయులకు అత్యంత అవసరం. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలులో ఉన్న నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) ఆధారంగా తరగతి బోధనలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయ పీరియడ్ పథకాలతో పాటు, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ రూపొందించిన నిరంతర సమగ్ర మూల్యాంకన ఆధారిత పీరియడ్ పథకాలపై అవగాహన కూడా శిక్షణార్థి ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఉండాలి.
-
If you encounter any technical issues during the course, please email coel@braou.ac.in
-
-
వార్షిక పథకం గురించి ప్రాథమిక భావనలను గుర్తుకు చేసుకుందాం
"వార్షిక పథకం" అంటే ఏదైనా సంస్థ, కార్యాలయం, పాఠశాల, లేదా ప్రభుత్వ విభాగం ఒక సంవత్సర కాలానికి అనుసరించబోయే పని ప్రణాళిక.
ఒక తరగతికి ఒక సంవత్సరంలో బోధించవలసిన గణిత పాఠ్య ప్రణాళికను అందుబాటులో ఉండే బోధనా సమయం దృష్ట్యా కొన్ని పాఠ్య విభాగాలుగా విభజించి ప్రతి పాఠ్య విభాగ బోధనకు పట్టే సమయం, తద్వారా సాధించాల్సిన లక్ష్యాలను సూచించే క్రమమే వార్షిక పథకం అంటారు. దీన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేయాలి. జూన్ నెల నుంచి ఏప్రిల్ చివరి దాకా అనగా ఒక విద్యాసంవత్సర కాలంలో జరిగే విద్యా బోధనా కార్యక్రమం వార్షిక పథకం, ప్రతి సబ్జెక్టులో ఒక విద్యా సంవత్సర కాలంలో ఒక తరగతికి బోధించాల్సిన విషయాన్ని, సాధించాల్సిన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన పథకమే వార్షిక పథకం.
-
"యూనిట్ పథకం" అంటే సాధారణంగా ఒక నిర్దిష్ట పాఠ్యభాగం (Unit) కోసం ముందుగానే తయారు చేసే బోధనా ప్రణాళిక.
-
పాఠ్య ప్రణాళిక/పీరియడ్ పథకం
మనకు తెలుసుగదా! ఒకే క్రమపద్ధతి, ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సరం కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి లక్ష్యాలు, సమయం ముందుగా నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా అనుకుంటే, ఆ వ్యవస్థలో అనేక ఉప వ్యవస్థలు ఉంటాయి. ఉప వ్యవస్థలు విశ్లేషిస్తే గానీ వస్థను మెరుగుపరచలేము. సూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించటానికి కావలసిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది. సూక్ష్మబోధనా నైపుణ్యాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు తరగతి గది లక్ష్యాలను చక్కగా సాధించవచ్చు. వివిధ నైపుణ్యాలతో పాటు సాంవత్సరిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక మరియు పీరియడ్ ప్రణాళికల అవగాహన కూడా ఉపాధ్యాయులకు అత్యవసరం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా తరగతి బోధన కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయక పీరియడ్ పథకాలతో పాటంగా నూతనంగా వచ్చిన రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ వెలువరించిన నిరంతర సమగ్ర మూల్యాంకన ఆధారిత, పీరియడ్ పథకం యొక్క అవగాహన ఛాత్రో పాధాయులుకు తప్పనిసరిగా ఉండాలి. -
సూచనలు
1. ఈ తుది అసెస్‌మెంట్‌లో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి.
మొదటి విభాగం: క్విజ్ – 30 మార్కులు
రెండవ విభాగం: అసైన్మెంట్ – 10 మార్కులు2. మొత్తం మార్కులు: 40
3. ఉత్తీర్ణత కోసం కనీస మార్కులు: 16
4. అన్ని ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి.
5. నిర్దిష్ట సమయానికి అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, “Finish Attempt” బటన్‌పై క్లిక్ చేయాలి.