ఈ పుస్తకం విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి ఉపయోగపడేది. ముఖ్యంగా తెలుగు చదువుకునే విద్యార్థులు సాహిత్యాన్నే కాకుండా, ఇతర అంశాలను కూడా నేర్చుకున్నట్లైతే వారి జీవితంలో ఉపాధి పొందే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ (స్కిల్ ఎన్ హన్ష్ మెంట్ కోర్స్) నైపుణ్యాన్ని పెంపొందించుకునే కోర్సులను ప్రవేశపెడుతున్నాం. ఈ కోర్సు రెండు క్రెడిట్స్ కోర్సు మాత్రమే. అయినా ఇది మీకు భవిష్యత్తులో ఈ కోర్సు మీకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో మీకు పరిచయం చేస్తున్నాం. ఇందులో మొదటి ఖండంలో పరిపాలనా భాషగా, ప్రభుత్వ వ్యవహారాలలో, పాఠశాల, కళాశాలలో బోధన భాషగా ఎట్లాంటి స్థానాన్ని వహిస్తుందో అనే విషయాలను తెలుసుకుంటారు.
Skill Level: Beginner