సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు
1. సూక్ష్మబోధన - అర్థం
సూక్ష్మబోధన – భావన, అర్థం
“నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తనపై కేంద్రీకరించడానికి నియంత్రించబడే బోధనా విధానమే సూక్ష్మబోధన” అని ఎలెన్ ఈవ్ పేర్కొన్నారు.
“సూక్ష్మబోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. ఇది బోధనాభ్యాసాన్ని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి, తరగతి కాలాన్ని మరియు తరగతి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధనా పరిస్థితిని సరళమైన మరియు అధిక నియంత్రిత వ్యూహంగా రూపొందిస్తుంది.”
“స్పష్టంగా నిర్వచించబడిన బోధనా నైపుణ్యాలను జాగ్రత్తగా తయారు చేసిన పాఠ్యాంశాలకు అన్వయించి, చిన్న సమూహ విద్యార్థులకు నాలుగు–ఐదు నిమిషాల్లో బోధించి, దాని ఫలితాలను వీడియో టేపు ద్వారా పరిశీలించడానికి అవకాశమున్న సాంకేతిక పరంగా నిర్వహించే ప్రక్రియ సూక్ష్మబోధన” అని రాబర్ట్ బుష్ నిర్వచించారు.
“సూక్ష్మబోధన అనేది ఒక శిక్షణా సాంకేతిక విధానం. ఇందులో స్వల్ప కాల వ్యవధిలో, స్వల్ప సంఖ్యలో ఉన్న విద్యార్థులకు నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు” అని బి.కె. పాసి మరియు ఎం.ఎస్. లలిత పేర్కొన్నారు.